అమ్మ ఆవేదన
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
ఈ కవిత అంకితం.