memorao

If you are interested in telugu literature and telugu poems, then this is a good spot to check it out.

Thursday, July 23, 2009

మళ్లీ వచ్చాడు సూర్యుడు

గ్రహణం విడిచిన సూర్యుడు మరింత తెజూవంతంగా హుషారుగా వెలుగులు చిమ్ముతున్నాడు.
కస్టాలు,కన్నీల్లు ,కలకాలం వుండవని,
ఎంతటి గ్రహణానికి గానీ విడుపుంటుందని,,
ధైర్యం చెపుతూ కోతి ప్రభలతో మార్గదర్శకుడిలా వస్తున్నాడు ప్రభాకరుడు//

ఉదయాన్నే తన కాన్తిపున్జాలతో లోకాలని వెలిగిస్తూ,,
కిరణాల చేతులతో కళ్లు తుడుస్తూ,
నిద్ర మత్తు వదిలించటానికి,,నిజమేదో విప్పిచేప్పటానికి,
మళ్లీ వచాడు సూర్యుడు..!!
నిన్న తఆనోసగిన వెలుగు వృధా చేసినా,,వీసమంతైన విసుగు చెందక,,
నిన్న తననేందరూ గుర్తించకున్నా నిరాశతో నీరుకారిపోక
ఒక్క రోజైనా బద్ధకించక
నిన్న తన వేడిలోని వాడిని లేఖ చెయ్యని యువతని అభినందించాలని ,,
నిన్న తన వేడిమికి ఓర్వలెక మూర్చిల్లిన ముదుసలిని ఓదర్చలని ,,
దయార్ద్ర హృదయంతో మళ్లీ వచాడు దినకరుడు..
నిన్న చేసినా పొరపాట్లను నేడైనా దిద్డుకున్తామని,,
నిన్నటి అసంపూర్ణ పనులు ,నేడు పూర్తి చేస్తామని,
నిన్న వృధా చేసినా సమయాన్ని,, నేడు సద్వినియోగం చేస్తామని,,
నిన్నటి నీరసం నిరాశ పునరావృతం కాకుండా,,మనకో అవకాశం ఇవ్వటానికి ,,
మళ్లీ మళ్లీ వస్తూనే వుంటాడు,,
స్ఫూర్తి ప్రదాత శ్రీ సూర్య భగవానుడు.!!

Sunday, July 19, 2009

నెల నెల వెన్నెల ---ప్రయాణం...

ప్రయాణం,
అమ్మ అమృత గర్భం నుండి, అంతిమ సత్యమిన నిన్ను చేరే,,
ఈ సుదీర్ఘ ప్రయాణంలో...
ఎదురయ్యేవేన్ని ముళ్ళ దారులో,,
సేద దీరే వెన్ని పూల తోటలో,,
ఎద వెలిగించేవేన్ని అనురాగ దీపాలో,,
కళ్లు తెరిపించేవేన్ని జ్ఞాన జ్యోతులో,,
అధివహించాల్సిన విజ్ఞాన శిఖరాలెన్నో,,
అధః పాతాళానికి చేర్చే అరిశాద్వార్గలెన్నో,,
తెలిసి తెలియని వయసులో విలువ తెలియక ,
వృధా అయిన పుణ్య కాలాలెన్నో,,
ప్రకృతిని పరిశీలించే వొరపు లేక,,
నియమ బధంగా నడిచే నేర్పు లేక,,
ఆదర బాదరాగా అన్ని కావాలంటూ,
అడుసులో కాలు వేసే,, ఈ అసహన యాత్రలో,,
అడుగడుగునా ఎదురయ్యే పద్మ వ్యూహ విచ్చేదనలో,
అలసి సొలసిన మనసుకు తాకినా,గాయాలనే,, గేయాలుగా పాడుతూ,
సాగే ఈ రాగ స్రవంతిలో,
చల్లని మలయ మారుతంలా,హాయి కలిగించే వారెందరో,
మరువ లేని మధుర గీతంలా కనుమరుగిన స్మృతి పదంలో,,
నిలిచి పోయే వారెందరో,
మానవత్వపు మకరందాలతో, స్నేహ సుగంధాలు వేద జల్లుతూ,సాగే,
ఈ ప్రయాణం నిత్య నవ్య జీవన యానం,!!!!!