memorao

If you are interested in telugu literature and telugu poems, then this is a good spot to check it out.

Saturday, March 13, 2010

అమ్మ ఆవేదన

నా కొంగు పట్టుకుని ,చుట్లు తిరిగిన రోజుల్లో,
అమ్మే అంతా అనుకున్నావు,ఇల్లే ప్రపంచం అనుకున్నావు.
అంత దూరాన నీవోక్కదివే చలికి దుప్పటి కప్పమని ,
నిద్రకు జో కొట్టమని,ఎవరినడుగుతావు?
ఇంటి గోడలు దూకి రోడ్డున పడ్డావని,
ఎడమ కుడి దారుల్లో ఇరుక్కుపోయావని,
నీవు దూరంగా వెళ్ళిన బాధ,
నీ నడతకు మమతలు పూసిన గాధ!
నీ సన్నిహితుడు స్నేహితుడా?హితుడా?
అన్న వివేచనా చెయ్యి,
నీవేసిన ప్రతి అడుగూ ప్రచన్నంగా కాపాడుకో,
మనిషిని మనిషినించి దూరం చేస్తుంది డబ్బు ,
నీది కాని దానిమీద ప్రణాలికలు పెంచద్దు,
నీకు కావాల్సింది సంపాదించుకో నీవే,
ఒకరి దయా భిక్షాల మీద ఒరగానీకు మనసు,
కరుకుగా వున్నా,నే రాసిన అక్షరాలూ మనసుమీద మలచుకో,
మనసులోని మమతకు మారుపేరు మాట,
మది గుచుకున్న ముళ్ళు నిడివి,,
ఎదకు తగిలిన గాయపు వైశాల్యం,
అది కత్తికి,కాదు కోత,గుండెకి!!
సమయా సమయ విచక్షణ లేక,
ఆలోచనలు,నోటితో,అనేయకు,
అడుగు వెనక్కు నడవకు,అన్న మాట కూడా ఆగిపోదు,మరి!!!
చీకటి లేక విలువ లేదు వెలుగుకి,
ఆవేదన లేక,అందం లేదు,ఆనందానికి,
మృత్యువు లేక మురిపెం లేదు జీవితానికి,
వ్రుదాప్యం లేక వింతే లేదు వయసుకి,
కన్నీరు తప్ప ఏదీ కడగలేదు కనుగుడ్లని,
పూల పరిమళాలు,పదిలంగా దాచుకో,
ముల్లునైన మలచుకో నీకనుగునంగా
నగరం నిగానిగాలతో,నిన్ను నుసి చేస్తుంది,
వ్యధ చెందిన నీ తల్లి ఉతరం,వృధా ప్రయాస కానీకు,
కన్నతల్లి మాటలు,దీపానికే వేలుగిస్తాయి,
నీ కలలో అవి వలయాలై,నిన్నే మెరిపిస్తాయి!!!!!
**************
తల్లి తండ్రులకి,దూరంగా వున్నా పిల్లలందరికీ,
ఈ కవిత అంకితం.

Wednesday, March 03, 2010

నేరస్తుడు

నేరస్తుడు

అన్యాయమని మనసు అరుస్తున్నా,
పెగలలేని నోటికి ఎపుదోచిన్డీ మూగతనం ??
అన్నీ అందరికీ తెలిసినా అడుసులో పడుతున్న అడుగులకి,
ఎవరీచారీ చచుదనం??
ధర్మపన్నాలేన్ని తెలిసినా,
జీవన సూక్తులెన్ని చదివినా,
వినలేని, నీకేక్కదిడీ, చెవిటితనం,
అక్కున చేర్చుకు ఆడుకోవాల్సిన చేతులకి
ఆసిడ్లు చల్లి,అగ్ని రగిలించి,వలువలూడ్చి,వెటకారం చేసి ,
వికతాత్తహాసం చేసే చవట తనమేక్కడిది,?
సృష్టిలోని సమానత్వమెరిగి,
సమ సమాజ నిర్మాణం జరగాల్సిన చోట ,
మత కలహాల పేరిట ఈ మారణ కాన్దలేమిటి?
విష వలయాలు పన్ని,విజ్ఞానం,బుగ్గిచేసే ,
ఈ వికృత రూపుల విలయ తాన్దవమేమిటి,??
యత్ర నార్యంతు పూజ్యంతే అని,మొదలుపెట్టి ,
స్త్రీ ని వ్యాపారప్రకటనల వస్తువుగా మార్చి,
ఆసిడ్లతో,కత్తి,పోట్లతో,చిత్రవధ చేస్తుంటే
అవాక్కయ్యాడు దేవుడు?????
ప్రకృతిలోని,సుకుమరమంతా,రూపుదాల్చి,వచ్చిన స్త్రీని,
మనిషి,యంత్రం,కాకుండా కాపాడే మహా మంత్రమైన స్త్రీని,,
ఆటబొమ్మలా,పరిహసిస్తూ,
అబలలని,అనగాతోక్కుతున్న,పిశాచాలని చూసి,

ఇలా యంత్రంగా,పాశానంగా,
మారిన మనిషిని నేను సృష్టించలేదు,
ఈ మనిషి ముసుగేసుకున్న జంతువెవరూ,నాకు తెలియదని,
చెయ్యని నేరానికి పశ్చాతాప పడుతూ,
అవాక్కయిన అంతరంగంతో,
నేరస్తుడిలా తల వంచాడు దేవుడు!!!!!

Sunday, February 21, 2010

శివ తత్వం,

నుదుటన నిప్పులు చిమ్మే నేత్రం,
శిరసున వెన్నెల కురిసే గంగా ఝరి,
మనకు వైవిధ్యాన్ని చూపే మార్గమిది,

గొంతులో ప్రలయకరం గరళం,
సిగలో అమృతమయం గంగాజలం,
స్థిత ప్రజ్ఞాత్వాని సూచించే సంకేతమిది,

అణిమాది సిద్దులవాడు ,అష్టైశ్వర్యాల వాడు,
అయినా బిచామేతుతాడు,
నలుగురినీ చూడాలనే ప్రేమ కనుక,!

మనకు స్త్రీలు,ఇంకా ఆటబొమ్మలు,
కానీ ఆయనే అర్ధనారీశ్వరుడు,!!

దైవత్వానికి రూపు దిద్దింది
,మనం,
ఆశల సొమ్ములు తోదిగేది మనం,
అర్ధాలు విప్పి చెప్పేది మనం,

దేవుడిని అలంకరిస్తున్నాం సరే,
మనమెందుకు, ఇలాగే ఉండిపోయాం?????

శివ తత్వం

Thursday, February 18, 2010

గాంధారి వారసులం

ప్రతిమనిషి ఎదుటిమనిషికి అద్దమే,

చూడచ్చు తమనితాము ఎదుటివాడి కళ్ళలో ,
చూడచ్చు తమ నడవడి పరిణామం సాటివానిపురోగామంలో ,
తాను యోజనాలు ప్రయాణం చేసాడు ,
తన గమనంలో కదలికలు లెక్కిస్తూ ,
తన నొసల్లు సంధించిన ధనస్సులు,
నేత్రాలు అస్త్రాలై నడిచే అమ్ములు,
పెదిమల చిరునవ్వుల లాస్యాలు ,
అవని సంధించిన శరత్తు ,
కరచాలనంలో విరిసిన స్నేహం,ఆశీస్సులు కురిపించే అమృతహస్తం ,
సాటి మనిషి ఉన్నతిని సహించలేని అసహనంతో ,
అంతా అవినీతి పరులనే అపనమ్మకంతో,
అర్ధంలేని నిస్సతువతో ,
అందుకోలేని అందలాలకోసం అంగలారుస్తూ
మనం చేయగలిగిన పనులుకూడా చెయ్యకుండా ,
ఎదుటివాడిని మాటల వలలో ఇరికిస్తూ, కస్ట్టపడుతున్నవాల్లని చులకన చేస్తూ,
బ్రతుకుని సూంబేరితనంతో గడుపుతున్నవారిని ,
చూడలేక,చూడక తప్పక,
స్వార్ధం చాటున మాయమైన హస్తాన్ని వెతుక్కుంటూ,
ఎదుటివాడి చూపుతో తన నడవడి దిద్దుకోలేక,
కేవలం సహృదయంతో సమస్యలు పరిష్కారం కావని తెలిసి,
మేధావి అయినా ,,మానవతావాది అయినాతప్పలేదు గాంధారికి గంతలు!!!
మర్మమెరిగిన మనమూ కావాలనే కట్టుకున్నాము గంతలు ,
మాన,ప్రాణ ,దహనాలాకు ,ఆవర్తులైన చీకటి గూళ్ళు ఈ రెండు కళ్ళు..!
ఎందరో గాంధరులు

గాంధారి

Monday, January 11, 2010

పాపం--పిల్లనగ్రోవి

వెదురుకు తెలియదు తనలో చేరిన ఊపిరి ,
ప్రాణం పోసుకుని నాదమై వెలువడుతుందని,,,
జగన్నాటక రంగంలో పాత్ర ధారినావుతానని,
వూపిరున్నంత సేపే తానూ మురళినని,,
అది లేక తానుత్త ,,వేడురునేనని !!
పలికించిన కొన్ని నాదలతోనైన ,అనుభూతులెన్నో పొంది,,
మహాభాగ్యంగా పదిలంగా దాచుకుంటూ
మాయా మోహంలో పడి ముచ్చట పడుతూంది,,
పాపం మురళికి తెలియదు,,తానుత వెదురుబడ్డ నేనని,,!!
కేరుమన్న ఏడుపుతో,ఆడిన శ్వాస ,
గంభీర నిశబ్దాన్ని చేరేదాక,
తపనతో ఆగని ఆరాటం జీవితం!!
శీతల పవనాల కూర్వలేక ఉన్ని నాశ్రయించే కోమల దేహం,
మంచుముక్కలపై ఎట్లు పరున్దేనో,,
వేడి గాడ్పులకే వదలేటి దేహం,
చితి మంటల సేగాలనేట్లోర్చేనో,,
పరుల కలతలకే కన్నీరోలికే ఆర్ద్రత తన వారి శోకమేట్లోర్చేనో,,
విధి కదా వింత సృష్టిలో,
మృత్యువే కదా వరం జన్మలో!!


ఐ అం

స్వేచా విహంగం

సత్యన్వేషనకై తరలిన శ్వాస విశ్వమంతా నిండిన ప్రానవాయువుని కలిసి ,
ప్రవసానంతరం తన వారిని కలిసిన
ఆనందానుభూతి పొందింది కాబోలు.
పాత్రానుగత ప్రారబ్ద మనుభవించి,
ప్రాక్రుతాల కర్మ ఫలానుభూతి చెంది,
ప్రలోభాల పద్మ వ్యూహాల చిక్కి,
అనుబంధాల పాశాల బంధింపబడి,
బాధ్యతల బంగారు బంధాల బిగిసి,
పడుగు పెకలైన పాప పుణ్యాల వలలో చిక్కి,
అతి ప్రయాసతో, బంధ విముక్తయై ,స్వేచా విహంగమై ,
సత్యాన్వేశానకై తరలింది శ్వాస !!!!

Wednesday, September 16, 2009

Mother's Heart

Then, holding your fingers i made you to walk

now, it is time to walk on your own
Then, narrating stories i gave you food

now, it is your turn to cook your self
time make you elder experience make you wiser staying away from parents you must mold your future by the way move among noble people who can sharpen your ideas, descriminate good from bad be alert in friends circles
money is main thing which makes you stand or fall it brings you friends and enemies dont touch even a penny which is not yours dont misuse for luxuries but dont hesitate for necessities contentment is essence of wisdom plan as per your purse

give thy thoughts no tongue words or powerful weapons too much talking bring troubles but talk when it is necessary so think twice when you talk

as you know eat for yourself and dress for others dress should be decent and dignified improve your image with good deeds

time and tide waits for none the right effort at right time is the best action for every time like the drop which falls in the shell at right time only can become pearl

my thoughts always watch you dont let your step slip which hurts your moms heart check every step of yours as mom is not there to protect you

i showed you moon and stars thenwhich made you happy and sleepy now dont try moonlights and star hotels which dont give you happi ness but only divert your goal dont run after artificial colours

life is so preceous and devine hard work sincierity and devotion lead you towards success which makes you tall among others

my words may sound hard and tough but keep them in your heart alwayswhich keep you in right directionin times of troubles and confusion

dont let your eyes become wet because tears will come from my eyes

my letter will be a torch for youin each and every turning point of your life.

Malaysia, Langkawi 1999

Labels:

Thursday, July 23, 2009

మళ్లీ వచ్చాడు సూర్యుడు

గ్రహణం విడిచిన సూర్యుడు మరింత తెజూవంతంగా హుషారుగా వెలుగులు చిమ్ముతున్నాడు.
కస్టాలు,కన్నీల్లు ,కలకాలం వుండవని,
ఎంతటి గ్రహణానికి గానీ విడుపుంటుందని,,
ధైర్యం చెపుతూ కోతి ప్రభలతో మార్గదర్శకుడిలా వస్తున్నాడు ప్రభాకరుడు//

ఉదయాన్నే తన కాన్తిపున్జాలతో లోకాలని వెలిగిస్తూ,,
కిరణాల చేతులతో కళ్లు తుడుస్తూ,
నిద్ర మత్తు వదిలించటానికి,,నిజమేదో విప్పిచేప్పటానికి,
మళ్లీ వచాడు సూర్యుడు..!!
నిన్న తఆనోసగిన వెలుగు వృధా చేసినా,,వీసమంతైన విసుగు చెందక,,
నిన్న తననేందరూ గుర్తించకున్నా నిరాశతో నీరుకారిపోక
ఒక్క రోజైనా బద్ధకించక
నిన్న తన వేడిలోని వాడిని లేఖ చెయ్యని యువతని అభినందించాలని ,,
నిన్న తన వేడిమికి ఓర్వలెక మూర్చిల్లిన ముదుసలిని ఓదర్చలని ,,
దయార్ద్ర హృదయంతో మళ్లీ వచాడు దినకరుడు..
నిన్న చేసినా పొరపాట్లను నేడైనా దిద్డుకున్తామని,,
నిన్నటి అసంపూర్ణ పనులు ,నేడు పూర్తి చేస్తామని,
నిన్న వృధా చేసినా సమయాన్ని,, నేడు సద్వినియోగం చేస్తామని,,
నిన్నటి నీరసం నిరాశ పునరావృతం కాకుండా,,మనకో అవకాశం ఇవ్వటానికి ,,
మళ్లీ మళ్లీ వస్తూనే వుంటాడు,,
స్ఫూర్తి ప్రదాత శ్రీ సూర్య భగవానుడు.!!